టారిఫ్ ల విషయంలో తగ్గేదే లేదంటున్న ట్రంప్.. భారత్ కు మినహాయింపేమీ లేదని వెల్లడి
- మీరెంత వేస్తే మేమూ అంత వేస్తామని స్పష్టం చేసిన ట్రంప్
- విదేశాల అధిక సుంకాలు ఇక అమెరికాకు సమస్య కాదని వివరణ
- మోదీతో భేటీకి ముందే ఉత్తర్వులపై సంతకం
భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి కొన్ని గంటల ముందే ట్రంప్ ఈ రెసీప్రోకల్ టారిఫ్ ల ఫైలుపై సంతకం చేశారు. అమెరికా వస్తువులపై ఏ దేశమైనా ఎంత పన్ను విధిస్తుందో అంతే మొత్తంలో ఆయా దేశాలపై అమెరికా పన్ను విధిస్తుందని స్పష్టం చేశారు. అమెరికా ప్రజలకు సంబంధించినంత వరకు ఇది సరైన చర్యేనని సమర్థించుకున్నారు. యూరప్ దేశాలు, చైనా తమపై అత్యధిక పన్నులు విధిస్తున్నాయని ట్రంప్ చెప్పారు. చాలా విషయాల్లో అడ్వాంటేజ్ తీసుకొంటున్నాయని, దీనిపై అమెరికా ఏమాత్రం సంతృప్తిగా లేదని వివరించారు. తాను అధికారంలోకి రాకముందు చైనాపై అమెరికా ఎలాంటి పన్ను విధించేది కాదని, తన మొదటి టర్మ్ లో చైనాపై పది శాతం పన్ను విధించానని ట్రంప్ గుర్తుచేశారు.