కేంద్ర బడ్జెట్ పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...!
- వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం
- పార్లమెంటులో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
- ఇది ప్రగతిశీల, ప్రజా బడ్జెట్ అని చంద్రబాబు కితాబు
- ఈ బడ్జెట్ ను తాను స్వాగతిస్తున్నానని వెల్లడి
మహిళా సంక్షేమం, పేదలు, యువత, రైతులకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారని, అంతేకాకుండా వచ్చే ఐదేళ్లలో ఆరు కీలక రంగాల్లో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేసినట్టు అర్థమవుతోందని చంద్రబాబు వివరించారు.
"దేశ సంక్షేమం దిశగా ఈ బడ్జెట్ ద్వారా కీలక ముందడుగు వేశారు. ఈ బడ్జెట్ మన దేశానికి సుసంపన్నమైన భవిష్యత్ ను అందించేలా సమగ్రమైన, కచ్చితమైన బ్లూప్రింట్‌గా నిలుస్తుంది. దాంతోపాటే... ఈ బడ్జెట్ ద్వారా మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అనదగ్గ మధ్య తరగతి ప్రజలకు పన్ను ఊరట కల్పించారు. ఈ బడ్జెట్‌ను నేను స్వాగతిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.