బాత్రూమ్ లో కెమెరా పెట్టి రికార్డ్ చేశాడని యువకుడికి దేహశుద్ధి.. చివరకు తెలిసిందేంటంటే..?
- చితకబాది యువకుడిని పోలీసులకు అప్పగించిన మహిళ భర్త
- విచారణలో ఆ వీడియో రికార్డు చేసిందని భార్యేనని తేలడంతో అవాక్కైన పోలీసులు
- అక్రమ సంబంధం కప్పిపుచ్చుకోవడానికి యువకుడిపై నింద.. బెంగళూరులో ఘటన
అసలు ఏం జరిగిందని పోలీసులు ప్రశ్నించగా.. ఆ యువకుడు గీజర్ రిపేర్ పేరుతో తమ ఇంట్లోకి వచ్చాడని, రిపేర్ చేస్తూనే గీజర్ లో సీక్రెట్ కెమెరా అమర్చాడని భర్త చెప్పాడు. తన భార్య స్నానం చేస్తుండగా రికార్డు చేసి ఆ వీడియోను నెట్ లో పెట్టాడని ఆరోపించాడు. అయితే, గీజర్ ఆన్ చేసిన తర్వాత బాగా వేడెక్కుతుందని, అందులో కెమెరా పెట్టే అవకాశమే లేదని పోలీసులు అనుమానించారు. దీనిపై బాధితురాలిని గట్టిగా నిలదీయగా అసలు విషయం వెల్లడించింది. ఆ వీడియో తీసింది తానేనని బయటపెట్టింది. తనను తాను నగ్నంగా వీడియో తీసుకుని ఆ యువకుడికి పంపానని చెప్పింది. ఆ యువకుడితో తనకు వివాహేతర సంబంధం ఉందని, అతడు కోరడంతో వీడియో తీసుకుని పంపించానని తెలిపింది. ఆ వీడియో చూసి భర్త నిలదీయడంతో తప్పించుకోవడానికి అబద్ధం చెప్పానని బాధితురాలు వివరించింది.