ఆ వ్యక్తికి సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసుతో సంబంధం లేదు: ముంబై పోలీసుల కీలక ప్రకటన
- ఉదయం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు
- సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన కేసు నిందితుడేనంటూ మీడియాలో కథనాలు
- సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసుల వివరణ
సైఫ్ అలీఖాన్ కేసుకు సంబంధించి ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
కాగా, ఈ ఉదయం పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అదుపులోకి తీసుకున్న వ్యక్తికి సైఫ్ కేసుతో సంబంధం లేదని పోలీసులు తాజాగా స్పష్టం చేశారు.