నిలకడగా సైఫ్ ఆరోగ్యం... ఔటాఫ్ డేంజర్ అన్న వైద్యులు

Doctors Say Saif Ali Khan Out Of Danger
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం తప్పినట్టేనని వైద్యులు ప్రకటించారు. కత్తిపోట్ల కారణంగా సైఫ్ వెన్నెముకకు గాయం అయిందని లీలావతి ఆసుపత్రి వైద్యుడు ఒకరు తెలపారు. మెడపైనా కత్తి గాయం అయిందని వివరించారు. సైఫ్ వీపు భాగంలో ఇరుక్కుపోయిన కత్తి మొనను బయటకు తీసినట్లు సమాచారం. కాగా, సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వివరించారు.

బుధవారం రాత్రి 2:30 గంటల ప్రాంతంలో సైఫ్ ఇంట్లోకి చొరబడ్డ ఓ దుండగుడు హీరోపై దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం దుండగుడు పారిపోగా సైఫ్ కుమారుడు ఇబ్రహీం తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. రక్తమోడుతున్న తండ్రిని ఎత్తకుని బయటకు పరుగు పెట్టాడు. సమయానికి కారు లేకపోవడంతో ఆటోలోనే సైఫ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా, దుండగుడి దాడిలో సైఫ్ కు ఆరుచోట్ల గాయాలయ్యాయని తెలుస్తోంది.
Go Back to Shorts
Saif Alikhan
Attack On Saif
Saif Stabbed
leelavati Hospital
karena kapoor

More Telugu News