ఎలాన్ మస్క్ పై ఆయన తండ్రి సంచలన వ్యాఖ్యలు
- ఎలాన్ చేప్పేవన్నీ పట్టించుకోవద్దన్న ఎర్రల్ మస్క్
- బిలియనీర్ కాబట్టే ఎలాన్ ట్వీట్లను చాలామంది రీట్వీట్ చేస్తారని వ్యాఖ్య
- తండ్రీకొడుకుల మధ్య తీవ్ర విభేదాలు
ఇక, తండ్రీకొడుకులు ఎర్రల్, ఎలాన్ మస్క్ ల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని గతంలోనే వెల్లడైంది. ఎలాన్ మస్క్ జీవిత చరిత్రపై పుస్తకంలో రచయిత ఐజాక్సన్ ఈ విషయం ప్రస్తావించారు. ఎలాన్ మస్క్ ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మద్దతిచ్చిన అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన తర్వాత ఎలాన్ మస్క్ కు విపరీతమైన ప్రాధాన్యం లభిస్తోంది. ఆ తర్వాత ఎలాన్ మస్క్ దేశ, విదేశాల రాజకీయ వ్యవహారాలలో ఎక్కువగా తలదూరుస్తున్నారు. వివిధ అంశాలపై ఎలాన్ చేస్తున్న ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి. చాలామంది ఆయన ట్వీట్లను రీట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ తండ్రి ఎర్రల్ స్పందించారు. తన కొడుకు మాటలు పట్టించుకోవద్దంటూ ఎర్రల్ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.