సంక్రాంతి కంటెంట్: ఒక్కో సినిమాలో ఒక్కో అంశంపై ఫోకస్!
- డిఫరెంట్ కంటెంట్ తో ఢీ కొడుతున్న సినిమాలు
- ఈ నెల 10న విడుదలవుతున్న 'గేమ్ ఛేంజర్'
- 12న థియేటర్లకు వస్తున్న 'డాకు మహారాజ్'
- 14వ తేదీన రిలీజ్ అవుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం'
ఒక భారీ బడ్జెట్ సినిమాను తీసే స్థాయి బడ్జెట్ ను కేవలం 5 పాటల చిత్రీకరణకు ఖర్చు చేయడం సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచుతోంది. దాంతో తమన్ స్వరపరిచిన ఈ పాటల ప్రపంచంలోకి ఎప్పుడు అడుగుపెడతామా అనే ఆసక్తితో ప్రేక్షకులు ఉన్నారు. ఇక ఈ నెల 12న విడుదల కానున్న 'డాకు మహారాజ్' విషయానికి వస్తే, ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చినట్టుగా సమాచారం. అరుదైన యాక్షన్ సీన్స్ ను నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. బడ్జెట్ లో ఎక్కువ భాగాన్ని యాక్షన్ సీన్స్ కోసమే కేటాయించారని అంటున్నారు.
ఈ నెల 14వ తేదీన 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రేక్షకులను పలకరించనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అనిల్ రావిపూడికి కామెడీపై ఉన్న పట్టు గురించి తెలియనిది కాదు. ఇక కామెడీ చేయడంలో వెంకటేశ్ కి గల నైపుణ్యాన్ని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఇలా ఈ మూడు సినిమాలలో ఒక్కోటి ఒక్కో అంశంపై ఎక్కువ ఫోకస్ చేస్తూ, తమ కంటెంట్ ను థియేటర్స్ కి తీసుకొస్తున్నారు. ఈ సినిమాలు ఏ రేంజ్ లో అలరిస్తాయో చూడాలి మరి.