బుద్దా వెంకన్న, బొండా ఉమలపై దాడి కేసు నిందితుడు తురకా కిశోర్ అరెస్ట్
- గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమలపై దాడి
- మాచర్లలో దాడికి పాల్పడిన తురకా కిశోర్
- కూటమి ప్రభుత్వం వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిన కిశోర్
- తాజాగా హైదరాబాదులో అరెస్ట్
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక అరెస్ట్ భయంతో తురకా కిశోర్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే, అతడి కోసం గాలిస్తున్న పల్నాడు పోలీసులు తాజాగా హైదరాబాదులో అరెస్ట్ చేశారు. ఈ దాడి కేసులో గత ప్రభుత్వ హయాంలోనే తురక కిశోర్ ను అరెస్ట్ చేసినప్పటికీ, ఒక్కరోజు వ్యవధిలోనే అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు.