కొడాలి నాని ప్రధాన అనుచరుడిని అసోంలో అరెస్ట్ చేసిన పోలీసులు
- గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి కేసు
- దాడికి సూత్రధారిగా భావిస్తున్న కాళీని అరెస్ట్ చేసిన గుడివాడ పోలీసులు
- ఇదే కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న 13 మంది వైసీపీ కార్యకర్తలు
ఈ కేసులో ఇప్పటికే 13 మంది కార్యకర్తలు అరెస్టయి రిమాండ్ లో ఉన్నారు. పరారీలో ఉన్న కాళీని అసోంలో గుడివాడ పోలీసులు పట్టుకున్నారు. కాళీ కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు.