దోహాలో ఉద్యోగం వచ్చిన గంటల్లోనే భారత యువ ఇంజినీర్ మృతి
యూకేలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన రాయీస్ ఉద్యోగం కోసం ఖతర్ చేరుకున్నాడు. దుబాయ్‌లోని ఓ కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ అందుకున్న రోజునే గుండెపోటుతో మృతి చెందినట్టు స్థానిక పత్రికలు తెలిపాయి. అతడి మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.