'ఆర్‌సీ 16'పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు
- బుచ్చిబాబు సానా, రామ్‌చరణ్ కాంబోలో 'ఆర్‌సీ 16'
- ప్రస్తుతం మైసూర్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు రత్నవేలు ట్వీట్
- చరణ్ సరసన కథానాయికగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్
- కీలక పాత్రలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్
- ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరకర్త
అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం మైసూర్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిపారు. ఈ టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందంటూ షూటింగ్ స్పాట్‌లోని ఒక ఫొటోను పంచుకున్నారు. 'రంగస్థలం' తర్వాత రామ్‌చరణ్‌తో కలిసి పనిచేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కథానాయికగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా. దేవరతో జాన్వీ టాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరకర్త.