కాలు మోపితే కాటికే... డేంజరస్​ మృత్యు గుహ ఇది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలు మోపితే కాటికే... డేంజరస్​ మృత్యు గుహ ఇది!

cave of death costa rica carbon dioxide
  • దక్షిణ అమెరికాలోని కోస్టారికా దేశంలో ఉన్న ‘కేవ్ ఆఫ్ డెత్’
  • అందులోకి వెళ్లిన జీవులేవైనా అప్పటికప్పుడే ప్రాణం కోల్పోవాల్సిందే...!
  • దానికి కారణం ఏమిటన్నది తేల్చిన శాస్త్రవేత్తలు
అదో గుహ... లోపలికి వెళ్లేందుకు చిన్న ద్వారం... చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది... కానీ అందులో అడుగుపెట్టారా... అప్పటికప్పుడే ప్రాణాలు హరీమన్నట్టే! చిన్నా పెద్దా ప్రాణులేవైనా సరే ఆ గుహలోకి వెళితే అంతే! ఇంతకీ ఆ గుహ ఎక్కడుందో తెలుసా? దక్షిణ అమెరికా ఖండంలోని కోస్టారికా దేశంలో ‘పోవాస్ అగ్నిపర్వతం పక్కన అడవుల మధ్యలో ఉంది. అది ఎంత డేంజర్ అంటే... దానిపేరే ‘కేవ్ ఆఫ్ డెత్’ అంటే మృత్యు గుహ.

గుహ ద్వారానికి సమీపంలోకి వెళితేనే...
గతంలో ఓ వ్యక్తి ఈ గుహ ద్వారానికి సమీపంలోకి వెళ్లాడు. ఒకట్రెండు నిమిషాల్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీనితో ఈ గుహ గురించి ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు ఆ గుహ లోపలికి వెళ్లిన చిన్న చిన్న జీవులు అప్పటికప్పుడే చనిపోతున్నట్టుగా గుర్తించారు. దీని గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోస్టారికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు వెళ్లి పరిశోధన చేశారు.

అగ్ని పర్వతం ప్రభావంతో...
అది చిన్నపాటి గుహనే అయినా... దాని నుంచి అత్యంత తీవ్ర స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ వెలువడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సమీపంలోని అగ్నిపర్వతం కారణంగా భూమి పొరల్లోని పగుళ్ల ద్వారా ఈ గుహలోకి కార్బన్ డయాక్సైడ్ లీకవుతున్నట్టు తేల్చారు. అది ఎంత అంటే ప్రతి గంటకు ఏకంగా 30 కిలోల కార్బన్ డయాక్సైడ్ వస్తున్నట్టు గుర్తించారు.

ప్రవాహంలా కార్బన్ డయాక్సైడ్...
కార్బన్ డయాక్సైడ్ సాధారణ గాలికన్నా బరువుగా ఉంటుంది. అందువల్ల గుహలో నుంచి వెలువడుతున్న ఆ వాయువు... అడుగుకు చేరి, ఒక ప్రవాహంలా బయటికి వస్తూ ఉంటుంది. కొందరు ఔత్సాహికులు ఆ గుహ వద్దకు వెళ్లి ఈ కార్బన్ డయాక్సైడ్ ప్రవాహాన్ని చూపడానికి వీడియోలు చేశారు. ఒక దివిటీ వెలిగించి... ఆ గుహలో పెడితే, అది వెంటనే ఆరిపోయి, పొగ కార్బన్ డయాక్సైడ్ తో కలసి ప్రవాహంలా బయటికి వస్తూ కనిపిస్తుండటం గమనార్హం.
Advertisement
offbeat
costa rica
Cave of death
science
Viral Videos
X Corp
Twitter

More Telugu News