యువతిని వేధించిన కేసులో యూట్యూబ్ నటుడు ప్రసాద్ అరెస్ట్
- ప్రసాద్ వేధించినట్లు ఫిర్యాదు చేసిన సహచర నటి
- కేసు నమోదు చేసి ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
- రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు బెహరా ప్రసాద్ తరలింపు
ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో బెహరా ప్రసాద్ తనకు పరిచయమయ్యాడని, అప్పుడు తనతో ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్నిరోజుల తర్వాత మరో వెబ్ సిరీస్‌లో కలిసి పని చేశామని, ఆ సమయంలో అందరిముందు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. దీనిపై ప్రశ్నిస్తే దూషించాడని, ఈ నెల 11న షూటింగ్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో అందరి ముందే తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.