రాహుల్ గాంధీ గారూ, ప్రేమను పంచడం అంటే ఇదేనా?: వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్
- హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ నిలదీత
- మహిళలు ఇంట్లో ఉండగానే ఇళ్లను కూల్చుతున్నారంటూ ఆగ్రహం
- మీ కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరిగితే అంగీకరిస్తారా? అని ప్రశ్న
తెలంగాణలో ఇంట్లో ఇద్దరు మహిళలు ఉండగానే బుల్డోజర్‌తో ఇళ్లను కూలగొట్టారని, ఆ మహిళల భౌతిక భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
ఇలాంటి ఘటనలు మీ కుటుంబంలో జరిగితే అంగీకరించగలరా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. పట్టింపు, మానవత్వం లేని ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడతాయని విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా కేటీఆర్ పోస్ట్ చేసి రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు.