KA Paul: అల్లు అర్జున్‌ను విడుదల చేయకుంటే కోర్టులో పిల్ వేస్తా: కేఏ పాల్

KA Paul says will file PIL to release Allu Arjun
షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయకుంటే తాను కోర్టులో పిల్ వేస్తానన్నారు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు తనకు తెలిసిందన్నారు. పుష్కరాలు సహా వివిధ ఘటనల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా కొంతమంది మృతి చెందితే చంద్రబాబును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు సరే... మరి చంద్రబాబు కందుకూరులో ర్యాలీ నిర్వహించినప్పుడు 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోయారన్నారు. 2019లో ఆయన పుష్కరాల్లో స్టంట్స్ చేస్తే 23 మంది చనిపోయారన్నారు. మరి చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారా? విచారణకు పిలిచారా? అని నిలదీశారు. బలవంతులైన రాజకీయ నేతలకు ఓ న్యాయం... సాధారణ వ్యక్తులు, నటులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. 
Go Back to Shorts
KA Paul
Telangana
Allu Arjun
Chandrababu

More Telugu News