విశాఖలో నలుగురు విద్యార్థులు హాస్టల్ నుంచి పరారైన వీడియో వైరల్
- లక్కీ భాస్కర్ సినిమాతో ప్రభావితులైన విద్యార్థులు
- అందులో హీరోలా ఇళ్లు, కార్లు సంపాదిస్తామంటూ వెళ్లిపోయిన వైనం
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజి వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ముందు తమ బ్యాగులు బయటకు విసిరేసిన విద్యార్థులు, ఆ తర్వాత ఒక్కొక్కరుగా గేటు దూకి పారిపోయారు. వారు, రోడ్డుపై పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా మరో సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
కాగా, విద్యార్థుల అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.