కొత్త రకం సైబర్ స్కామ్.. అప్రమత్తత ప్రకటించిన తెలంగాణ పోలీసులు

Telangana police alert on fake parcel scam
  • పార్సిల్ వచ్చిందంటూ ఫోన్లు.. డ్రగ్స్ ఉన్నాయంటూ బెదిరింపులు
  • కేసులు, సెక్షన్లు అంటూ పెద్ద ఎత్తున డబ్బు వసూలు
  • అప్రమత్తం చేసిన తెలంగాణ పోలీసులు
అమాయక జనాలను దోచుకునేందుకు కేటుగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. కొత్త కొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పార్సిల్ వచ్చిందంటూ ఏదో ఒక ప్రముఖ కంపెనీ నుంచి ఫోన్ చేసి.. ఆ  పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయంటూ భయపెడుతున్నారు. ఆ కొద్దిసేపటికే కస్టమ్స్ అధికారులమంటూ కేటుగాళ్లు రంగంలోకి దిగి కేసులు, సెక్షన్లు అంటూ భయబ్రాంతులకు గురిచేసి పెద్ద మొత్తంలో డబ్బు వసూలుకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలపై తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ విధమైన ఫేక్ పార్సిల్ స్కామ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేశారు.

ప్రముఖ కంపెనీల పేరుతో కాల్ చేసి పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయంటూ బెదిరిస్తున్నారని, డబ్బు వసూలు చేస్తున్నారని, అందుకే బుక్ చేయని పార్సిల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తరహా సైబర్ నేరాలపై 1930 నంబర్‌ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ‘‘ జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి!’’ అంటూ ఎక్స్ వేదికగా అప్రమత్తం చేశారు. పార్సిల్‌లో డ్రగ్స్, నిషేధిత వస్తువులు ఉన్నాయని బెదిరిస్తే నమ్మవద్దని సూచించారు. కేసులు, సెక్షన్ల అని నమ్మించే ప్రయత్నం చేస్తారని, చివరకు డబ్బు వసూలుకు పాల్పడతారని వివరించారు.
Go Back to Shorts
Cybercrime
Telangana
Police
Crime News

More Telugu News