శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-59
- యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్
- ఈ సాయంత్రం 4.04 గంటలకు ముగిసిన కౌంట్ డౌన్
- నిప్పులు చిమ్ముతూ రోదసికి ఎగిసిన పీఎస్ఎల్వీ-సి59
ప్రోబా శాటిలైట్లు సూర్యుడి వెలుపలి భాగమైన కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి. కరోనా అనేది అత్యంత ప్రకాశవంతమైన భాగం కావడంతో... ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రోబా-3 శాటిలైట్లకు రూపకల్పన చేశారు. కృత్రిమ సూర్య గ్రహణాలను సృష్టించి కరోనాపై పరిశోధనలు సాగించడం ప్రోబా-3 ప్రత్యేకత.