నేడు పీఎస్ఎల్వీ సీ59ని ప్రయోగించనున్న ఇస్రో
- సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ సీ59 ప్రయోగం
- రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్న ఇస్రో
- నిన్న మధ్యాహ్నం 2.38 గంటల నుంచి కొనసాగుతున్న కౌంట్ డౌన్
షార్ లోని మొదటి ప్రయోగ వేదికపై అనుసంధానం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రాకెట్ ద్వారా అక్యుల్టర్, కరోనా గ్రాస్ అనే రెండు శాటిలైట్లను నింగిలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ నిన్న మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రారంభమయింది.
మరోవైపు, ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారి సుప్రభాతసేవలో ఇస్రో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకెట్ నమూనాని స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.