స్నానం చేస్తుండగా పేలిన గీజర్.. కొత్త పెళ్లికూతురి మృతి
- ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఘటన
- స్నానానికి వెళ్లి బయటకు రాని యువతి
- పిలిచినా స్పందన లేకపోవడంతో తలుపులు పగలగొట్టిన కుటుంబ సభ్యులు
- లోపల గీజర్ పేలిన దృశ్యం.. అపస్మారక స్థితిలో నవ వధువు
- ఆసుపత్రికి తరలించినా ఫలితం శూన్యం
సాయంత్రం స్నానం కోసం బాత్రూముకు వెళ్లిన యువతి సమయం గడుస్తున్నా బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. భర్త, కుటుంబ సభ్యులు చాలాసార్లు పిలిచినా స్పందన రాకపోవడంతో బాత్రూము తలుపులు పగలగొట్టారు. లోపల యువతి అపస్మారక స్థితిలో పడి ఉండగా, గీజర్ పేలిపోయి ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గీజర్ పేలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.