మీరు క్షమార్హులు కారు: పోసానిపై టాలీవుడ్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
- రాజకీయాలకు దూరంగా ఉంటానన్న పోసాని
- కుటుంబాల గురించి, పిల్లల గురించి నీచంగా మాట్లాడారన్న ఎస్కేఎన్
- అభిమానుల మనసులను ఎంతో బాధ పెట్టారని వ్యాఖ్య
మరోవైపు పోసాని నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ మీరు నటించే ముందు... తమ అభిమాన నాయకుడి గురించి, వారి ఇంట్లోని పసి పిల్లల గురించి మాట్లాడిన సంస్కార హీనమైన, నీచమైన మాటలకు చింతిస్తున్నానని లేదా క్షమించండని అడిగి ఉంటే... మీ మాటలను నమ్మాలనిపించేదని అన్నారు. మీరేదో పొరపాటున ఒకసారి మాట్లాడిన వ్యక్తి కాదని మండిపడ్డారు. ఎన్నోసార్లు చాలా నీచంగా మాట్లాడారని దుయ్యబట్టారు.
అభిమానుల మనసును మీరు ఎంతో బాధ పెట్టారని ఎస్కేఎన్ అన్నారు. ఛీ ఇవేం మాటలు అంటూ అందరూ చెవులు మూసుకునేలా చేశారని మండిపడ్డారు. ఎవరి కుటుంబాలైనా, ఎవరి పిల్లలైనా ఒక్కటేనని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని... కానీ వ్యక్తిగతంగా దిగజారిపోయి కుటుంబాల మీద కామెంట్స్ చేసిన మీలాంటి వాళ్లు ఏ మాత్రం క్షమార్హులు కారని అన్నారు.