జొమాటోలో అత్యున్నత ఉద్యోగం.. తొలి ఏడాది జీతం వుండదు.. 20 లక్షలు మనమే కట్టాలి!
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన జొమాటో సీఈవో పోస్టు
- రెండో ఏడాది నుంచి రూ.50 లక్షలకు పైనే జీతం
- నేరుగా తనకే కవరింగ్ లెటర్ రాయాలని దీపిందర్ గోయెల్ సూచన
తొలి ఏడాది కోసం ఫీజుగా రూ.20 లక్షలను జొమాటో ఆధ్వర్యంలోని నాన్ ప్రాఫిట్ కంపెనీకి విరాళంగా అందించాలని తెలిపారు. ఏడాదిపాటు సంతృప్తికరంగా పనిచేస్తే ఆ మరుసటి ఏడాది నుంచి రూ.50 లక్షలకు పైగా వార్షిక వేతనంతో నియామకపు ఉత్తర్వులు ఇస్తామని వివరించారు. అంతేకాదు, తొలి ఏడాదికి సంబంధించి రూ.50 లక్షలను ఉద్యోగి సూచించిన ఛారిటీ సంస్థకు జొమాటో విరాళంగా ఇస్తుందని దీపిందర్ పేర్కొన్నారు. ఇక ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా రెజ్యుమె పంపాల్సిన అవసరం లేదని, ఆసక్తి ఉన్న వారు నేరుగా తనకే ఓ కవరింగ్ లెటర్ రాయాలని చెప్పారు. కాగా, ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.