మొదటి రెండు మ్యాచ్ లు టీమిండియాకు అత్యంత కీలకం: రవిశాస్త్రి
- టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ
- నవంబరు 22 నుంచి ఐదు టెస్టుల సిరీస్
- కివీస్ పై ఏమరుపాటు కొంపముంచిందన్న రవిశాస్త్రి
- ఇప్పుడు ఆసీస్ పై రాణించడం ద్వారా పుంజుకోవాలని సూచన
ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో టీమిండియాకు మొదటి రెండు మ్యాచ్ లు అత్యంత కీలకమని అభిప్రాయపడ్డాడు. ఇటీవల, ఏం జరుగుతోందో తెలిసే లోపే న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైందని అన్నాడు.
కివీస్ తో టెస్టు సిరీస్ లో ఏమరుపాటుగా వ్యవహరించిన టీమిండియా అందుకు మూల్యం చెల్లించిందని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అంతమాత్రాన టీమిండియాను తక్కువ చేసి చూడలేమని, ఈ జట్టును చూసి గర్విస్తున్నానని తెలిపాడు.
ఓ సిరీస్ లో ఎదురైన ఓటమి నుంచి పుంజుకోవాలంటే మరో సిరీస్ లో శుభారంభం చేయడమే మార్గమని అభిప్రాయపడ్డాడు. అందుకే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు టీమిండియా కోణంలోంచి చూస్తే ఎంతో ముఖ్యమని అన్నాడు.