టాయిలెట్లో 10 నిమిషాలకు మించి కూర్చుంటున్నారా? అయితే జాగ్రత్త!
- మొలల ముప్పుతోపాటు కటి కండరాలు బలహీనంగా మారుతాయంటున్న నిపుణులు
- టాయిలెట్ కమోడ్‌పై ఎక్కువ సేపు కూర్చుంటే రక్త ప్రసరణకు ఆటంకం
- సిరలు, రక్తనాళాలు పెద్దవిగా మారి మొలలు వచ్చే ప్రమాదం
టాయిలెట్ కమోడ్‌పై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుందని, దీంతో పాయువు, దిగువ పురీషనాళం చుట్టూ ఉండే సిరలు, రక్తనాళాలు పెద్దవిగా మారి మొలలు ఏర్పడతాయని వివరించారు. మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది దానిని టాయిలెట్లోకి తీసుకెళ్లి దానిని చూస్తూ నిమిషాలకు నిమిషాలు గడిపేస్తున్నారు. చాలామందికి ఇది అలవాటుగానూ మారింది. ఈ నేపథ్యంలో నిపుణులు ఈ హెచ్చరిక చేశారు.