Nara Rammurthi Naidu: చంద్రబాబు సోదరుడి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy offers condolences to the demise of Nara Rammurthi Naidu
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఈ మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుకు గురయ్యారు. రామ్మూర్తినాయుడ్ని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఆయన తుదిశ్వాస విడిచారని ఏఐజీ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. 

రామ్మూర్తినాయుడి మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి మృతి దిగ్భ్రాంతికరం అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. రామ్మూర్తినాయుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Nara Rammurthi Naidu
Demise
Revanth Reddy
Chandrababu
Hyderabad

More Telugu News