Darshan Thoogudeepa: అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్

Kannada Actor Darshan Gets Interim Bail
షార్ట్స్‌లో చూడండి
అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో జైలుకెళ్లిన కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు బుధవారం ఆరువారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. సర్జరీ కోసం బెయిలు కావాలంటూ దర్శన్ పెట్టుకున్న పిటిషన్‌పై నిన్ననే వాదనలు ముగిశాయి. తీర్పును నేటికి రిజర్వు చేసిన జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తాజాగా మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అభిమాని హత్య కేసులో జూన్ 11న దర్శన్ అరెస్టయ్యాడు.

సహనటి పవిత్రగౌడకు రేణుకాస్వామి అసభ్యకర సందేశాలు పంపడంతో ఆగ్రహించిన దర్శన్ అతడిని చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్టు ఆరోపణలున్నాయి. కలవాలని పిలిపించి దారుణంగా హత్యచేసినట్టు పోలీసులు తెలిపారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి షాక్, గాయాల కారణంగా రక్తస్రావంతో మరణించినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఈ కేసులో పవిత్రగౌడ ప్రధాన ముద్దాయిగా ఉన్నారు.
Go Back to Shorts
Darshan Thoogudeepa
Kannada Actor
Pavithra Gowda
Renukaswamy
Karnataka High Court

More Telugu News