ఏపీఎండీసీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
- గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని భావిస్తున్న కూటమి సర్కారు
- విచారణ ముమ్మరం
- ఇప్పటికే గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్
- వెంకటరెడ్డి నుంచి సేకరించిన సమాచారంతో నేడు తనిఖీలు
వెంకటరెడ్డి ఇప్పటికే ఇసుక టెండర్ల వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే నేడు ఏసీబీ అధికారులు ఏపీఎండీసీ కార్యాలయంలో సోదాలు చేపట్టారు.