సహాన కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
- బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల
- ప్రతి విషయాన్ని వైసీపీ రాజకీయ లబ్ది కోసం వినియోగించుకోవడం సిగ్గు చేటని విమర్శ
- కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు మంజూరు చేయాలని మంత్రిని కోరిన హతురాలి తల్లి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. రౌడీ షీటర్ల ఆగడాలను అదుపు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. ప్రతి విషయాన్ని వైసీపీ రాజకీయ లబ్ది కోసం వినియోగించుకోవడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ఇల్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా హతురాలి తల్లి మంత్రిని కోరారు.
కాగా, నిన్ననే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెనాలితో పాటు బద్వేల్ ఘటనలోని బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో పాటు ప్రతి బాధిత కుటుంబానికి పది లక్షల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తామని ప్రకటించారు.