గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన... కేటీఆర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
- మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రూప్-1 ఎగ్జామ్స్
- ఇప్పటికే కేంద్రాలకు చేరుకుంటున్న అభ్యర్థులు
- కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద పోలీసుల మోహరింపు
కాగా, నేటి నుంచి గ్రూప్-1 పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనుండడంతో అభ్యర్థులు ఇప్పటికే కేంద్రాలకు చేరుకుంటున్నారు. 1.30 గంటలకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల లోపలికి అనుమతిస్తారు.