ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ దివాళీ సేల్’ తేదీలు వచ్చేశాయ్.. స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు
- అక్టోబర్ 21న ప్రారంభంకానున్న భారీ ప్రత్యేక సేల్
- ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’ యూజర్లకు ఒక రోజు ముందే ఆరంభం
- స్మార్ట్ఫోన్లతో ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలపై భారీ తగ్గింపు ఆఫర్లు
ఈ సేల్‌లో కస్టమర్లు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అంతేకాకుండా ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ తగ్గింపు ఆఫర్లు పొందొచ్చని తెలిపింది.
అదిరిపోయే ఆఫర్లు ఇవే...
రూ.19,999 ధర ఉన్న ఒక స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.9,999కే అందుబాటులో ఉంటుందని అధికారిక వెబ్సైట్లో ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. దీపావళి సేల్‌లో కొనుగోలుదారులు రూ.1,500 ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్, రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,500 అదనపు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది. మొత్తంగా కస్టమర్లు రూ.10,000 వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఎస్బీఐ కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్లు గరిష్ఠంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చని, యాక్సిన్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి అన్ని కొనుగోళ్లపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చని తెలిపింది.