Allu Arjun: ఆర్యలో హీరోగా బన్నీ అలా సెట్ అయ్యాడు: సుకుమార్

Sukumar comments on arya in allu arjun
షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్, సుకుమార్... ఈ హిట్ కాంబినేషన్ జోడీ ఆర్యతో మొదలైంది. ఆర్యతో మొదలై ఆర్య 2, పుష్ప, పుష్ప – 2 మూవీలతో కొనసాగుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో త్వరలో పుష్ప – 2 ది రూల్ రాబోతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ మూవీ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అర్జున్, సుకుమార్ కలయిక మాత్రం ఆర్య మూవీతోనే..అప్పటి వరకు ఉన్న మూస ప్రేమకథల బాణీకి బ్రేక్ చేసి ఆర్య ప్రేమకథా చిత్రాల్లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఆర్య చిత్రం నిర్మాణానికి ముందు జరిగిన పలు ఆసక్తికర విషయాలను సుకుమార్ ఇటీవల ఓ సమావేశంలో పంచుకున్నారు. 

తాను 'దిల్' సినిమాకు పని చేస్తున్న సమయంలోనే విశాఖలో చిత్ర నిర్మాణం జరుగుతున్నప్పుడు తాను రాసిన కథలోని కొన్ని సన్నివేశాలు, మాంటేజ్ షాట్స్ దిల్ రాజుకు చెబుతుండేవాడినని, అవి ఆయనకు బాగా నచ్చి దిల్ సినిమా హిట్టయితే దర్శకత్వం ఛాన్స్ ఇస్తానని చెప్పేవాడని సుకుమార్ తెలిపారు. దిల్ మూవీ గొప్ప హిట్ కావడంతో తనకు ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని పిలిపించి ఓ రీమేక్ సినిమా చెయ్యమని దిల్ రాజు అడిగాడని, అయితే తాను నిర్మొహమాటంగా చేయనని చెప్పేశానన్నారు. సరే కథ చెప్పమని అనడంతో తాను చెప్పగా, చాలా ఆసక్తిగా దిల్ రాజు కథ విన్నారని, కొంత సమయం ఆలోచించి ఓకే చెప్పారన్నారు.

ఇక అప్పటి నుండి హీరో వేటలో ఉన్నానని, తన మనసులో మాత్రం కొత్తవారితో చేద్దామని ఉండేదన్నారు.  ఒకసారి నేను అల్లు అర్జున్ పేరు చెప్పగా అందరూ నవ్వేశారన్నారు. ఆ సమయంలో దిల్ ప్రివ్యూ వేస్తే అల్లు అర్జున్ వచ్చారని, బన్నీ అందరినీ ఎంతో హుషారుగా పలకరిస్తూ హడావుడి చేశాడన్నారు. అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ కౌగిలించుకుంటున్నాడు. ఆ క్షణంలో తనకు బన్నీలో ఆర్య కనిపించాడని, అప్పటి వరకూ తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన స్నేహితులు కూడా బన్నీకి ఓటేశారన్నారు. 'మన ఆర్యకు బన్నీ కరెక్ట్‌గా సరిపోతాడు' అని అన్నారని, ఆ తర్వాత మూడు నెలలు ఆడిషన్ చేసి మరీ ఆర్య చిత్ర నిర్మాణం మొదలు పెట్టామని సుకుమార్ చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
Allu Arjun
sukumar
Movie News

More Telugu News