Pushpa-2 first half report: పుష్ప-2 ఫస్ట్‌హాఫ్‌ రిపోర్టు వచ్చేసింది..

Pushpa2 first half report has arrived
షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్‌, సుకుమార్‌ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పుష్ప-2 దిరూల్‌. ఇంతకు ముందు ఈ కలయికలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ సినిమా పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌ ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ అండ్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అయితే అందరి ఊహించిన దానికంటే అద్భుతంగా సినిమా వుండబోతుందని చిత్ర యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

తాజాగా ఈ చిత్రం గురించి పుష్ప-2 సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సోమవారం హైదరాబాద్‌లో దేవిశ్రీప్రసాద్‌ లైవ్‌ కన్‌సర్ట్‌ గురించి ఏర్పాటు చేసిన ఓ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ''పుష్ప-2 ఇటీవల ఫస్ట్‌ హాఫ్‌ చూశాను. మైండ్‌ బ్లోయింగ్‌గా వుంది. పుష్ప కథను ఇప్పుడే కాదు స్క్రిప్ట్‌ విన్నప్పుడే నేను లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌ మూడు సార్లు క్లాప్స్‌ కొట్టాం.. సుకుమార్‌ కథ చెబుతున్నప్పుడు ఇక్కడ ఇంటర్వెలా.. ఇక్కడ ఇంటర్వెలా అని మేము అంటున్నాం.. అంతలా మాకు ప్రతి సీన్‌ కిక్‌ ఇచ్చింది. ప్రతి సీన్‌లోనూ ఎంతో ఎనర్జీ వుంటుంది.


సినిమా చూసినప్పుడు సుకుమార్‌ కథను రాసిన విధానం  సినిమాను తెరకెక్కించిన తీరు, అల్లు అర్జున్‌ నటించిన విధానం నెక్ట్స్‌ లెవల్‌లో వుంటుంది. సినిమా నెక్ట్స్‌ లెవల్‌ సినిమా అంతే.. ఇక ఫస్ట్ హాఫ్‌ అయితే సూపర్‌గా వుంది అంతే..అని అన్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్‌ మాటలు విన్న అల్లు అర్జున్‌ అభిమానులు సంతోషంలో వున్నారు. ఇటీవలే పుష్ప-2 మేకర్స్‌ ఫస్ట్‌హాఫ్‌ను లాక్‌ చేసినట్లుగా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
.
Go Back to Shorts
Pushpa-2 first half report
Allu Arjun
Devisri prasad about pushpa 2
Sukumar
Pushpa
Pushpa-2
Pushpa2

More Telugu News