Sarpanch Elections: ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఇస్తా... సర్పంచ్ అభ్యర్థి భారీ మేనిఫెస్టో

Sarpanch Candidate Released Manifesto
షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రధాన హామీలతో మేనిఫెస్టో తయారుచేసి విడుదల చేయడం తెలిసిందే. అయితే, పార్టీలకు అతీతంగా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఓ అభ్యర్థి కూడా మేనిఫెస్టో విడుదల చేశారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కొడారి లత సర్పంచ్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి ఏంచేస్తాననే వివరాలతో ఓ భారీ మేనిఫెస్టో తయారుచేసి తాజాగా గ్రామ సభలో విడుదల చేశారు. పార్టీలకు అతీతంగా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ 14 అంశాలతో కూడిన మేనిఫెస్టో పోస్టర్‌ ను గ్రామస్థులకు పంచారు.

గ్రామపంచాయతీలో మంచినీటి ఫిల్టర్, గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం వైకుంఠ రథం, ఫ్రీజర్ సదుపాయం కల్పించడంతో పాటు కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం అందిస్తానని చెప్పారు. దీంతోపాటు వాటర్ ట్యాంకర్, ఇంటి పన్ను మాఫీ, ఆడపిల్ల జన్మిస్తే రూ.5000 సహాయం, ఆడపడుచులకు పెళ్లి కానుక, ఒంటరి మహిళలు, వృద్ధులకు నివాస వసతి గృహం, ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానని కొడారి లత హామీ ఇచ్చారు. 

నిరుద్యోగ ఆడపడుచులకు టైలరింగ్ శిక్షణ కేంద్రం, స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్, చేపల పెంపకం విషయంలో ముదిరాజ్ లకు చెరువులపై పూర్తి అధికారం కోసం కృషి, గ్రామంలో గ్రామ దేవతల గుడి నిర్మాణం, అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, బస్తీ దవఖాన, గ్రంథాలయం తదితర సదుపాయాలు కల్పిస్తానని కొడారి లత తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
Go Back to Shorts
Sarpanch Elections
Manifesto
Yadadri Bhuvanagiri District
Turkapally

More Telugu News