కిన్నెర కళాకారుడు మొగులయ్య ప్లాట్ కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేసిన దుండగులు
- 2022లో పద్మశ్రీ అవార్డు పొందిన మొగులయ్య
- హయత్ నగర్‌లో 600 గజాల ప్లాట్ ఇచ్చిన ప్రభుత్వం
- ప్లాట్ చుట్టూ కాంపౌండ్ వాల్ వేసిన మొగులయ్య
కానీ ఈ గోడను రాత్రికి రాత్రి దుండగులు కూలగొట్టారు. కాంపౌండ్ వాల్ కూల్చివేయడంతో మొగిలయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొగిలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. గోడ కూల్చివేతకు కారణం ఎవరో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని హయత్ నగర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజ్ గౌడ్ తెలిపారు. ఈ ప్లాట్‌కు సంబంధించి ఎలాంటి భూవివాదం లేదని స్పష్టం చేశారు. తనకు ఎవరిపై అనుమానం కూడా లేదని మొగిలయ్య చెప్పినట్లు వెల్లడించారు.
జానపద సంగీత కళాకారుడు మొగులయ్యకు 2022లో పద్మశ్రీ అవార్డు లభించింది. తెలంగాణకు చెందిన ప్రత్యేకమైన జానపద సంగీత వాయిద్యమైన కిన్నెర సాంప్రదాయ కళారూపాన్ని పరిరక్షించడంలో చేసిన కృషికి గాను కేంద్రం పద్మ అవార్డుతో సత్కరించింది.