ఆ ద‌ర్శ‌కుడు ఓ అమ్మాయిని గ‌ర్భ‌వ‌తిని చేశాడు.. పూన‌మ్ కౌర్ ట్వీట్ వైర‌ల్‌!

Actress Poonam Kaur Sensational Tweet
పంజాబీ భామ పూన‌మ్ కౌర్ తాజాగా సోష‌ల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ దుమారం రేపుతోంది. ఇండ‌స్ట్రీలోని ఓ ద‌ర్శ‌కుడు ఒక అమ్మాయిని గ‌ర్భ‌వ‌తిని చేసి, ఆపై అబార్షన్ చేయించి ఆమె కెరీర్‌ను నాశ‌నం చేశాడ‌ని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ‘మా’ జోక్యంతో ఆ పంజాబీ న‌టికి కాస్త స‌హాయం దొరికిందని పేర్కొన్నారు. అత‌డు రాజకీయ నాయకుడిగా మారిన న‌టుడు కాద‌ని స్పష్టం చేశారు.

అయితే, ఈ విష‌యంలోకి త‌న‌ను, ఆ నేత‌ను అన‌వ‌స‌రంగా లాగార‌ని పూనమ్ కౌర్ వాపోయారు. ఈ పోస్టులో పూన‌మ్ ఎవ‌రి పేర్ల‌నూ ప్ర‌స్తావించ‌లేదు. కాగా, ఆమె ఇటీవ‌ల మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌పై ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం పూన‌మ్ పోస్ట్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.
Go Back to Shorts
Poonam Kaur
Twitter

More Telugu News