మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో 36 మంది నక్సల్స్ మృతి.. చరిత్రలోనే అతిపెద్ద ఘటన!

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో 36 మంది నక్సల్స్ మృతి.. చరిత్రలోనే అతిపెద్ద ఘటన!

36 Maoists Killed In Encounter Along Dantewada Border In Chhattisgarh
  • నారాయణ్‌పూర్-దంతెవాడ జిల్లా సరిహద్దులోని నెందూర్-తుల్‌తులి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్
  • మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఎదురు కాల్పులు
  • మృతుల్లో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ
  • కొనసాగుతున్న కూంబింగ్
మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. నారాయణ్‌పూర్-దంతెవాడ జిల్లా సరిహద్దులోని నెందూర్-తుల్‌తులి అటవీ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 36కు పెరిగింది. తొలుత ఏడుగురు మృతి చెందినట్టు వార్తలు రాగా, ఆ తర్వాత ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ 36 వద్దకు వచ్చి ఆగింది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.

మావోయిస్టు పార్టీ కాయ్-6కు చెందిన శ్రేణులే మృతి చెందారని, వీరిలో ఆ పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు, విజయవాడకు చెందిన జోరిగె నాగరాజు అలియాస్ రామకృష్ణ, అలియాస్ కమలేశ్ అలియాస్ విష్ణు (52) కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రానికి 14 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47, ఎస్ఎల్ఆర్ తుపాకులు వంటి 36 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Advertisement
Maoists Encounter
Chhattisgarh
Dantewada

More Telugu News