మేడారం అడవుల్లో ఒకేసారి 50 వేల చెట్లు కూలిపోవడానికి శాస్త్రవేత్తలు చెబుతున్న కారణం ఇదే!
- భారీ ఈదురు గాలులు, వర్షానికి మేడారం అటవీ ప్రాంతంలో కుప్పకూలిన 50వేల చెట్లు
- రెండు ప్రాంతాల్లో వాయుగుండం సంభవించడం వల్ల గంటకు 130 నుండి 140 కిలో మీటర్ల వేగంతో గాలులు
- చెట్ల వేళ్లు భూమిలో లోతుగా కాకుండా అడ్డంగా వెళ్లడం కూడా నేల కూలడానికి కారణమని చెబుతున్న శాస్త్రవేత్తలు
ఆ ప్రాంతంలో గాలులు బలంగా వీచడం వల్ల ఈ విపత్తు జరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బలమైన మేఘాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైన కారణంగా ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షపాతం కూడా విపత్తుకు కారణం అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. సారవంతమైన భూమిలో చెట్లు త్వరగా ఎదగడం వల్ల ఈ చెట్ల వేళ్లు భూమిలోకి నిటారుగా కాకుండా అడ్డంగా వెళ్లడం కూడా చెట్లు త్వరగా నేలకొరగడానికి కారణం కావచ్చని అంటున్నారు. దాదాపు 332 హెక్టార్ల విస్తీర్ణంలో 50 వేల చెట్లు నేలకొరిగాయి.