తెలంగాణలోని ఈ ఏడు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
- మధ్య, బంగాళాఖాతంలో అల్పపీడనం
- దాని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- దేవరుప్పలలో నిన్న అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వాన
మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
కాగా, నిన్న జనగామ జిల్లా దేవరుప్పలలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో అత్యల్పంగా 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.