ఆ చీప్ ట్రిక్స్ పనిచేయవు.. హైడ్రాను ఆపే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన రేవంత్‌రెడ్డి
- హైడ్రాపై ల్యాండ్ మాఫియా దుష్ప్రచారం చేస్తోందన్న రేవంత్‌రెడ్డి
- పేదలను బూచిగా చూపే చీప్ ట్రిక్స్ పనిచేయవని స్పష్టీకరణ
- నగరానికి లేక్సీటీ పేరును పునరుద్ధరిస్తామన్న సీఎం
- ప్రభుత్వానికి సహకరించి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
తెలంగాణను ఫ్యూచర్ సిటీగా అభివర్ణిస్తున్నాం కాబట్టి నగరం క్లీన్ సిటీగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. తాను గతంలో చెప్పినట్టు ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవంతోపాటు పర్యావరణ పునరుజ్జీవం కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వానికి సహకరించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.