రీల్స్ చేస్తూ లోయలో పడిన మహిళ.. వీడియో ఇదిగో!
- హిమాచల్ ప్రదేశ్‌లో ఘటన
- రొమాంటిక్ సాంగ్ ‘బేపనా ప్యార్ హై, తేరా ఇంతెజార్ హై’ పాటకు డ్యాన్స్
- కాలు జారి లోయలోకి దొర్లుకుంటూ పోయిన యువతి
తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో ఓ యువతి రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఓ లోయలో రాయిపైకి ఎక్కి నిల్చున్న యువతి.. కెమెరామన్ స్టార్ట్ అనగానే రొమాంటిక్ సాంగ్ ‘బేపనా ప్యార్ హై, తేరా ఇంతెజార్ హై’ పాటకు డ్యాన్స్ చేస్తూ చేతులూపింది. అనంతరం తిరిగి వస్తుండగా కాలు జారి కిందికి దొర్లుకుంటూ పోయింది. ఈ మొత్తం ఘటన కెమెరాలో రికార్డయింది. ఆ వీడియో అంతవరకు ఉంది. వీడియోను బట్టి ఆమెకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది.