ఆ రెండు బ్యాంకులపై కొరడా ఝళిపించిన ఆర్బీఐ
- చట్టపరమైన, నియంత్రణ పరమైన నిబంధనల ఉల్లంఘన
- యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులపై ఆర్బీఐ సీరియస్
- యాక్సిస్ బ్యాంకుకు రూ.1.91 కోట్ల జరిమానా
- హెచ్‌డీఎఫ్‌సీకి కోటి జరిమానా విధించిన ఆర్బీఐ
డిపాజిట్లపై వడ్డీ, బ్యాంక్ రికవరీ ఏజంట్లు, బ్యాంకు కస్టమర్ సర్వీసులకు సంబంధించి నిబంధనలు పాటించకపోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కోటి రూపాయల జరిమానా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలు పాటించకపోవడం, డిపాజిట్లపై వడ్డీ, కేవైసీ, వ్యవసాయ రుణాలకు సంబంధించి మార్గదర్శకాలు పాటించకపోవడంపై యాక్సిస్ బ్యాంక్ కు రూ.1.91 కోట్లు జరిమానా విధించినట్లు ఆర్బీఐ పేర్కొంది.