హైడ్రా కూల్చివేతలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

BJP Mla Rajasingh Sensational Comments On HYDRAA
  • ఆ కాలేజీలను కూల్చేస్తే మీరే హీరో అంటూ రేవంత్ రెడ్డికి సూచన
  • ఓవైసీకి చెందిన కాలేజీని ఎప్పుడు కూల్చేస్తున్నారంటూ ప్రశ్న
  • ఆదివారం 30 టీమ్ లతో ఐదు చోట్ల హైడ్రా కూల్చివేతలు
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో నెమ్మదించిన హైడ్రా తాజాగా దూకుడు పెంచింది. ఆదివారం ఏకంగా 30 టీమ్ లతో ఐదు చోట్ల కూల్చివేతలు చేపట్టింది. పోలీస్ బందోబస్తు మధ్య, రెవెన్యూ, మునిసిపాలిటీ అధికారుల సమక్షంలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలోనే హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారో చెప్పాలంటూ హైడ్రా చీఫ్ రంగనాథ్ ను ప్రశ్నించారు. ఏ రోజు కూలుస్తారో సమయం చెప్పాలంటూ రేవంత్ రెడ్డిని, రంగనాథ్ ను నిలదీశారు. ఆ కాలేజీలు కూల్చేస్తే మీరే హీరో అవుతారంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అలా కాకుండా వాటిని వదిలేస్తే మాత్రం హైడ్రా మిషన్ విఫలం అయినట్లేనని రాజాసింగ్ చెప్పారు.
Advertisement
Raja Singh
BJP Mla
HYDRA
Owaisi
Fatima College

More Telugu News