పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్.. ట్వీట్ ఇదిగో!
- కొంతకాలంగా పవన్ కు దూరంగా ఉంటున్న అల్లు అర్జున్
- ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం
- బన్నీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పీకే ఫ్యాన్స్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. అప్పటి నుంచే సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీనికితోడు ఓ సినిమా రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం మరింత పెరిగింది. హీరోల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.