జీడీపీ అంటే తెలియని తేజస్వి అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది: ప్రశాంత్ కిషోర్
- అప్పుడు స్విట్జర్లాండ్‌లా కనిపించిన బీహార్ ఇప్పుడు హీనంగా కనిపిస్తోందా? అని ప్రశ్న
- నితీశ్ మళ్లీ మహా ఘట్‌బంధన్‌లో చేరితే అద్భుతంగా కనిపిస్తుందేమోనని ఎద్దేవా
- అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడి
గత పదిహేనేళ్లుగా వారు అధికారంలో ఉన్నారని, కానీ తేజస్వికి మాత్రం జీడీపీ అంటే తెలియదన్నారు. ఆయన ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్విట్జర్లాండ్‌లా కనిపించిన బీహార్ ఇప్పుడు హీనస్థితిలో కనిపిస్తోందా? అని ధ్వజమెత్తారు.
నితీశ్ కుమార్ తిరిగి మహా ఘట్‌బంధన్‌లో చేరితే మళ్లీ రాష్ట్రం అద్భుతంగా కనిపిస్తుందేమోనని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుతామన్నారు.