హ్యాక్ అయిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎక్స్ ఖాతా
- తన ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందన్న గడ్డం ప్రసాద్
- తన టెక్నికల్ టీమ్ చర్యలు తీసుకుని సెట్ చేశారని వెల్లడి
- హ్యాక్ అయిన సమయంలో పెట్టిన పోస్టులతో తనకు సంబంధం లేదన్న స్పీకర్
"సూచన... ఈ రోజు ఉదయం నా వ్యక్తిగత ఎక్స్ ఖాతా కొంత సమయం హ్యాక్ అయింది. మా టెక్నికల్ టీమ్ ఈ విషయాన్ని గమనించి వెంటనే చర్యలు తీసుకుని సెట్ చేశారు. నా ఎక్స్ ఖాతా హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్ లకు, నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను" అని స్పీకర్ ట్వీట్ చేశారు.