Nani: భార్య, కొడుకుతో కలిసి కాలినడకన తిరుమలకు హీరో నాని.. వీడియో వైర‌ల్!

Hero Nani Visits Tirumala
షార్ట్స్‌లో చూడండి
నేచురల్‌ స్టార్‌ నాని కాలినడకన తిరుమలకు వెళ్లారు. భార్య‌ అంజన, కుమారుడు అర్జున్‌తో క‌లిసి అలిపిరి నుంచి మెట్లమార్గంలో తిరుమల చేరుకున్నారు. వారితోపాటు హీరోయిన్‌ అరుళ్‌ మోహన్‌ కూడా ఉన్నారు. అనంతరం వారు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక నానిని చూసిన అభిమానులు ఆయ‌న‌తో ఫొటోలు దిగేందుకు ఎగ‌బ‌డ్డారు. 

కాగా, ఈ నెల 29న వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ విడుదల కానున్న విష‌యం తెలిసిందే. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుంది. ఇక మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఆగస్టు 24న గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. 

వివేక్ ఆత్రేయ‌, నాని కాంబినేష‌న్‌లో ఇంతకుముందు వ‌చ్చిన అంటే సుంద‌రానికి చిత్రం మంచి విజ‌యం సాధించింది. దీంతో ఇప్పుడు కాంబోలోనే వ‌స్తున్న‌ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స‌రిపోదా శ‌నివారంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.  

ఇక ఈ మూవీలో త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రలో క‌నిపించ‌నున్నాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మించింది. ఈ సినిమా ఇతర భాషల్లో Suryas Saturday పేరుతో విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్‌.
Go Back to Shorts
Nani
Tirumala
TTD

More Telugu News