తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష సమయాల్లో మార్పు
Advertisement

తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష సమయాల్లో మార్పు

Group 1 mains exams timings changed
  • అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు
  • పరీక్షలను అరగంట ముందుకు జరిపిన టీజీపీఎస్సీ
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు పరీక్షలు
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా సమయాన్ని మార్చినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. గతంలో నిర్దేశించిన సమయం కంటే అరగంట ముందుగానే నిర్వహించనుంది.

తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ తాజా మార్పు ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటించింది. హాల్ టికెట్స్‌తో పాటు శాంపిల్ ఆన్సర్ బుక్ లెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.

563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా... మెయిన్స్ పరీక్ష కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్ 1 పరీక్షలకు నాలుగు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్‌కు 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గత నెలలో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 31 వేల మందికి పైగా అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.
Advertisement
TGPSC
Telangana
Group 1

More Telugu News