ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి?... లైవ్ లో నేర్చుకున్న హీరో నాని... వీడియో ఇదిగో!

Hero Nani learns self defence technics
 
నేచురల్ స్టార్ నాని ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భద్రతా బలగాలు నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో ఆత్మరక్షణ విధానాల (సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్) ను ఓ నిపుణుడు ప్రదర్శించి చూపగా, నాని నేర్చుకునేందుకు ప్రయత్నించారు. 

తన చేతిలో ఉన్న పిస్టల్ ను ఆ సెల్ఫ్ డిఫెన్స్ నిపుణుడు ఎంతో చాకచక్యంగా లాగేసుకోవడంతో, నాని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అవే టెక్నిక్స్ ను నాని తిరిగి ప్రదర్శించి చూపారు. 

ఇజ్రాయెల్ తరహా క్రోమెగా ట్రైనింగ్ తీరుతెన్నుల గురించి భద్రతా బలగాలకు చెందిన నిపుణుడు వివరించగా, హీరో నాని ఆసక్తిగా విన్నారు. అనంతరం, జవాన్లు ప్రదర్శించిన పలు ఆత్మరక్షణ మెళకువలను నాని తిలకించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Advertisement
Nani
Self Defence
Technics
Independence Day
Tollywood

More Telugu News