మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమా చెప్పే పాఠం ఇదే.. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
- పీజీఐఎమ్ఈఆర్ స్నాతకోత్సవంలో చీఫ్ జస్టిస్ ప్రసంగం
- పేషెంట్లను అర్థం చేసుకునే సున్నిత హృదయం యువ డాక్టర్లకు ఉండాలని సూచన
- మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలోని సన్నివేశాలు ఇదే అంశాన్ని ప్రతిఫలిస్తున్నాయని వ్యాఖ్య
దేశంలో వైద్య విద్య అభివృద్ధికి పీజీఐఎమ్ఈఆర్ గత 62 ఏళ్లల్లో ఎంతో చేసిందని కొనియాడారు. దేశంలో వైద్య రంగం అభ్యున్నతికి పాటుపడాల్సిన బాధ్యత యువ డాక్టర్ల మీద ఉందని అన్నారు. రోగుల సాధకబాధకాలను అర్థం చేసుకుని, సాంత్వన కలిగించాల్సిన బాధ్యత యువ డాక్టర్లపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మున్నాభాయ్ సినిమాను కూడా ప్రస్తావించారు. మూవీలోని హీరో ఆత్మీయ ఆలింగనం ఎందరో రోగులకు భరోసా, మనస్సాంతిని కలిగించిన విషయాన్ని గుర్తు చేశారు. పేషెంట్ల బాధలు, మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన ఆవస్యకతను ఈ సీన్ ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. ఇటీవల నీట్ ఉదంతాన్ని కూడా ప్రస్తావించిన ఆయన మెడికల్ కాలేజీల్లో ఎంట్రీకి సంబంధించి నైతికత కూడా కీలకమని అన్నారు.