మధ్యప్రాచ్యంలో భారీగా యుద్ధ నౌకలు, విమానాలు మోహరిస్తున్న అమెరికా.. తీవ్ర ఉద్రిక్తత
- హమాస్ చీఫ్ హత్యకు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక నేపథ్యంలో ఉద్రిక్తతలు
- ఈ ప్రాంతంలోని పౌరులు, ఇజ్రాయెల్ రక్షణకు అదనపు బలగాలను మోహరించేందుకు అమెరికా నిర్ణయం
- ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని ప్రకటన
ఇరాన్, దాని భాగస్వాముల హెచ్చరికల కారణంగా ఏర్పడిన ఉద్రిక్తతల తీవ్రతను తగ్గించేందుకు రక్షణ శాఖ చర్యలు తీసుకుంటుందని పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ అమానవీయ దాడి జరిగిన నాటి నుంచి ఆ దేశ రక్షణతో పాటు ఈ ప్రాంతంలోని తమ సిబ్బంది రక్షణ, ప్రయోజనాలను కాపాడుతున్నామని ప్రస్తావించింది.
కాగా ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌తో పాటు ప్రాంతీయ భాగస్వాములు కూడా శపథం చేశాయి. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు అలముకున్నాయి. భయానక వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారత పౌరులతో పాటు అక్కడికి వెళ్లేవారికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒక అడ్వైజరీ జారీ చేసిన విషయం తెలిసిందే.